ఆలియా భట్.. పాంచ్ పటాకా!
on Nov 29, 2021

`మహేశ్ భట్ తనయ` అనే ట్యాగ్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`వంటి విజయవంతమైన చిత్రంతో కథానాయికగా తొలి అడుగేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై `హై వే`, `2 స్టేట్స్`, `హంప్టీ శర్మ కీ దుల్హానియా`, `ఉడ్తా పంజాబ్`, `బద్రినాథ్ కీ దుల్హానియా`, `రాజీ`, `గల్లీ బాయ్` తదితర సినిమాలతోనూ మెమరబుల్ హిట్స్ ని అందుకుంది.
ఇదిలా ఉంటే.. 2022 ఆలియా భట్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఐదు సినిమాలతో పలకరించబోతోంది ఆలియా. జనవరిలో పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`తో ఎంటర్టైన్ చేయనున్న ఆలియా.. ఫిబ్రవరిలో బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా `గంగూబాయి కతియావాడి`తో సందడి చేయనుంది. అలాగే సెప్టెంబర్ లో సూపర్ హీరో ఫిల్మ్ `బ్రహ్మాస్త్ర`తో అలరించనున్న మిస్ భట్.. ఆపై కామెడీ డ్రామా `డార్లింగ్స్`తోనూ, రొమాంటిక్ డ్రామా `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`తోనూ వినోదాలు పంచనుంది. మరి.. 2022లో ఆలియా భట్ ఇవ్వనున్న ఈ పాంచ్ పటాకా.. ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



