బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం.. బాబాయ్ బాటలో అబ్బాయి!
on Nov 29, 2021

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసార'. హిస్టారికల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'బింబిసార' టీజర్ సోమవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ విజువల్ గా ఆకట్టుకునేలా ఉంది. 'బింబిసార'గా కళ్యాణ్ రామ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం" అంటూ టీజర్ లో బింబిసారుడిని పరిచయం చేస్తూ వచ్చిన వాయిస్ ఓవర్ పవర్ ఫుల్ గా ఉంది. ఇక టీజర్ చివరిలో స్టైలిష్ లుక్ లో కనిపించి కళ్యాణ్ రామ్ సర్ ప్రైజ్ చేశాడు. మొదటి నుంచి ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న సినిమా అని ప్రచారం జరిగింది. ఇప్పుడు టీజర్ చూస్తుంటే ఆ ప్రచారంలో వాస్తవం ఉందని అనిపిస్తోంది. గతంలో బాబాయ్ బాలకృష్ణ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన 'ఆదిత్య 369'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. మరి ఇప్పుడు అబ్బాయి కళ్యాణ్ రామ్ కూడా ఆ స్థాయిలో ఆకట్టుకుంటాడేమో చూడాలి.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా కేథరిన్, సంయుక్త మీనన్ సందడి చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



