నాగు గవర దర్శకత్వం లో ఆలీ హీరోగా సంజయ్ రామస్వామి
on Aug 10, 2016

అదిత్, సుప్రియ శైలజ జంటగా రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రలో రూపొందిన విభిన్నకథా చిత్రం వీకెండ్ లవ్. ఈ విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర. తన తదుపరి చిత్రాన్ని కామెడీ కింగ్ ఆలీ హీరోగా సంజయ్ రామస్వామి అనే టైటిల్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. సంజయ్ రామస్వామి అనే టైటిల్ కి గతం కెలుక్కున్న గజిని అనేది ట్యాగ్ లైన్.
సూర్య హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం గజిని. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ పేరు సంజయ్ రామస్వామి. ఇప్పుడు గజిని చిత్రంలోని సూర్య క్యారెక్టర్ పేరు సంజయ్ రామస్వామి టైటిల్ గా గతం కెలుక్కున్న గజిని అనేది ట్యాగ్ లైన్ గా నాగు గవర సినిమాని ప్లాన్ చేస్తుండడం ఓ విశేషమైతే... డిఫరెంట్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో కామెడీ కింగ్ ఆలీ హీరోగా నటిస్తుండడం మరో విశేషం. అవుట్ & అవుట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటూ సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తిగా చూసేలా ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ నాగు గవర తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



