అఖిల్‌కి హ్యాండిచ్చి.. నితిన్‌తో??
on Aug 10, 2016

అఖిల్ ఆశలు అడియాశలయ్యాయి. రెండో సినిమాకి దర్శకులు దొరికినట్టే దొరికి చేజారిపోతున్నారు. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథతో హిట్టిచ్చి అందరి దృష్టిలోపడిన హను రాఘవపూడి అఖిల్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. హనుతో కమిట్ అయిపోదామనుకొంటున్న సమయంలో హను తన నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు టాక్. ఇప్పుడు హను.. నితిన్ దగ్గరకు వచ్చాడట. అ.ఆ తరవాత నితిన్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు.
చాలా కథలు విన్నా.. దేనికీ ఓకే చెప్పలేదు. చివరికి హను రాఘవపూడితో సినిమాని ఓకే చేసినట్టు టాక్. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించడానికి నితిన్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇది అఖిల్ కోసం అనుకొన్న కథే అని.. చివరికి నితిన్ చేయబోతున్నాడని టాక్. నిజానికి ఈ కథ ఎన్టీఆర్ కోసం రాసుకొన్నాడట హను. ఎన్టీఆర్‌కి ఈ కథ బాగా నచ్చిందట. అయితే జనతా గ్యారేజ్ తో బిజీగా ఉండడం వల్ల ఎన్టీఆర్ ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ తరవాత.. అఖిల్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు నితిన్‌తో చేస్తున్నాడన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



