డేటింగ్లో బాల్ ఠాకరే మనవడు, పూజా బేడి కూతురు!
on Oct 8, 2020
ఈ ఏడాది జనవరిలో వచ్చిన సైఫ్ అలీఖాన్ మూవీ 'జవానీ జానేమన్'లో తియా క్యారెక్టర్ పోషించిన అలాయ ఫర్నిచర్వాలాకు అదే తొలి సినిమా అంటే నమ్మబుద్ధి కాదు. అంత మెచ్యూర్డ్‌గా ఆ క్యారెక్టర్ చేసింది అలయా. ఆమె నిన్నటి తరం తార పూజా బేడి, ఫరాన్ ఫర్నిచర్‌వాలా కుమార్తె. ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేదాకా లైమ్‌లైట్‌కు దూరంగానే ఉంది. గ్లామర్ వరల్డ్‌లో అడుగుపెట్టడం ఆలస్యం మీడియా దృష్టి ఆమె మీద పడింది. ఆమె ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనపరుస్తూ వస్తున్నారు.
'జవానీ జానేమన్' సినిమా విడుదలకు కొద్ది వారాల ముందే బాల్ ఠాకరే మనవడు ఐశ్వర్య్ ఠాకరేతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం మొదలైంది. వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ను మించిన బంధం నడుస్తోందని వదంతులు వచ్చాయి. అక్టోబర్‌లో ఐశ్వర్య్ దుబాయ్‌లో తన సన్నిహిత స్నేహితుల మధ్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. వారిలో అలాయ ఎఫ్ కూడా ఉంది!
ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఐశ్వర్య్ తల్లి స్మితా ఠాకరే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఆ వీడియోలో అలాయ దర్శనమిచ్చింది. అలాగే, "హ్యాపీ బర్త్‌డే ఐశ్వర్య్" అని రాసున్న కేక్ ప్లేట్ పిక్చర్‌ను తన ఐజీ స్టోరీలో పోస్ట్ చేసిన ఐశ్వర్య్ దానికి తల్లి స్మితతో అలాయకు కూడా ట్యాగ్ చేశాడు. అంతేనా.. ఒక హార్ట్ ఎమోజీ కూడా జోడించాడు.