'అల.. వైకుంఠపురములో' రన్ టైమ్ 156 నిమిషాలు
on Jan 3, 2020
.jpg)
అల్లు అర్జున్ కథా నాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ శుక్రవారం (జనవరి 3) పూర్తయ్యాయి. కత్తెరకు పనిచెప్పకుండా సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నిడివి 156 నిమిషాలని తెలియవచ్చింది. నిన్న 'సరిలేరు నీకెవ్వరు' తరహాలోనే 'అల.. వైకుంఠపురములో' సెన్సార్ పోస్టర్‌లో విడుదల తేదీని వెల్లడించలేదు. అల్లు అర్జున్ క్యారెక్టర్‌లోని రెండు ఎమోషన్స్‌ని చూపించేలా ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. "గతంలో ఎన్నడూలేని విధంగా సంక్రాంతి గ్రాండ్ సెలబ్రేషన్‌కు మాది గ్యారంటీ. ఫ్యామిలీస్‌తో థియేటర్లకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం" అని నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ పేజీల ద్వారా తెలిపాయి.
ఇటు 'అల.. వైకుంఠపురములో' కానీ, అటు 'సరిలేరు నీకెవ్వరు' కానీ ఇదివరకు అనుకున్న తేదీలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయనీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ దగ్గర చేసుకున్న ఒప్పందాన్ని ఆ సినిమాలు నిర్మాతలు ఉల్లంఘించే అవకాశాలు లేవనీ సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం రెండు సినిమాల నిర్మాతలు ఈ విషయమై దాగుడుమూతలు ఆడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో' జనవరి 12న విడుదల కావాల్సి ఉంది.
కాగా ఈ సినిమా ఒకప్పటి ఎన్టీఆర్ సినిమా 'ఇంటిగుట్టు', మలయాళ సినిమా 'మై బాస్' సినిమా కథలకు దగ్గరగా ఉంటుందని అంతర్గత వర్గాల సమాచారం. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చెయ్యగా 2012లో వచ్చిన 'మై బాస్'లో బాస్‌గా మమతా మోహన్‌దాస్, ఆమె అసిస్టెంట్‌గా దిలీప్ నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



