అల్లు అర్జున్ సెట్‌లో అక్కినేని హీరో
on Jun 7, 2019

అవును... అల్లు అర్జున్ సెట్‌లో అక్కినేని హీరో అడుగుపెట్టాడు. కొన్ని రోజులు హీరోలు ఇద్దరూ కలిసి షూటింగ్ చేయనున్నారు. ఇంతకీ, ఎవరా అక్కినేని హీరో అంటే... నాగార్జున మేనల్లుడు సుశాంత్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో సుశాంత్ కీలకమైన పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అతడు సెట్‌లో అడుగుపెట్టాడు. తన పాత్ర గురించి ఎక్కువ చెప్పలేనని... స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, తన ఫేవరెట్ దర్శకుడు త్రివిక్రమ్, పవర్ హౌస్ టబు, ఫ్రెండ్ పూజా హెగ్డే, ఇతర బృందంతో కలిసి పని చేయడానికి ఎగ్జయిటెడ్ గా ఉన్నానని సుశాంత్ ట్వీట్ చేశాడు. 'చిలసౌ' విజయం తరవాత అతడు నటిస్తున్న చిత్రమిది. ఈ వారంలో మరో సినిమా గురించీ అప్‌డేట్ ఇస్తానని సుశాంత్ తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



