`దొరసాని` దర్జా బావుంది!!
on Jun 6, 2019

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవితా రాజశేఖర్ ల ముద్దుల తనయ శివాత్మిక తొలిసారిగా జంటగా నటిస్తోన్న చిత్రం `దొరసాని`. కేవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. టైటిల్ దగ్గర నుంచి ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఫిదా చేసింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై మనసులు దోచుకుంటోంది. తెలంగాణలోఎయిటీస్ లో గడీల కాలంలో జరిగే స్టోరిగా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్ లో హీరో ఆనంద్ దేవరకొండ , హీరోయిన్ శివాత్మిక లుక్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ` మీరు నా దొరసాని అంటూ హీరో చెప్పే డైలాగ్ తో స్టోరి ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఒక సామాన్య మానవుడు, దొరసాని లాంటి అమ్మాయి ప్రేమించడం, వారి మధ్య భావోద్వేగాలు, లవ్ ఇంటెన్సిటీ ఇవన్నీ కలబోసిన ఒక చక్కటి ప్రేమకథా చిత్రంగా ఉండబోతుంది. ఇక హీరో డైలాగ్ డెలివరీ, తెలంగాణ మాడ్యులేషన్ చాలా నేచరల్ గా ఉంటూ టీజర్ తోనే అందరి మనసులు దోచుకున్నారు ఈ జంట. త్వరలో సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



