అఖిల్ నిప్పు... నాగచైతన్య నీరు!
on Jan 30, 2019

అక్కినేని యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్... ఇద్దరితోనూ నిధి అగర్వాల్ సినిమాలు చేసింది. నాగ చైతన్య సరసన నటించిన 'సవ్యసాచి' అట్టర్ ఫ్లాప్ కాగా.. అఖిల్ అక్కినేని సరసన నటించిన 'మిస్టర్ మజ్ను' యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో నిధి అగర్వాల్ ఊపిరి పీల్చుకుంది. తన నటనకు మంచి పేరు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానం దాటవేసింది అమ్మడు. వ్యక్తిత్వంలో మాత్రం ఇద్దరూ వేర్వేరు అని చెప్పింది. అఖిల్ అక్కినేని ఫైర్ లాంటోడు అని... చైతన్య వాటర్ లా కూల్ గా ఉంటాడని చెప్పింది. సవ్యసాచి తో పాటు అంతకుముందు తాను నటించిన హిందీ సినిమాల్లో తనను అందాల బొమ్మ గా చూశారని.. మిస్టర్ మజ్ను తర్వాత తనను నటిగా చూస్తున్నారని నిధి అగర్వాల్ చాలా సంతోష పడుతుంది. రామ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ లోను తనకు మంచి పాత్ర దక్కిందని చెప్పింది. తెలుగులో మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



