ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఏజెంట్'!
on Jan 9, 2024
ఈమధ్య కాలంలో జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కానీ గతేడాది విడుదలై ఘోర పరాజయం పాలైన 'ఏజెంట్' మాత్రం.. ఎనిమిది నెలలు దాటినా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది.
అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా 2023, ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ థియేటర్లలో మిస్ అయినవారు.. ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి బాగానే ఆసక్తి చూపారు. కానీ ఏవో కారణాల వల్ల ఓటీటీ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. నెలలు గడిచిపోవడంతో ఈమధ్య అసలు 'ఏజెంట్' ఊసే లేదు. దాదాపు అందరూ ఈ మూవీ గురించి మర్చిపోతున్న సమయంలో సడెన్ గా 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి ఇంత ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న ఏజెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
Also Read