అఖండ2 టికెట్ రూ.5 లక్షలు.. ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?
on Dec 4, 2025
ప్రపంచవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమైన 'అఖండ2' డిసెంబర్ 5న ప్రీమియర్స్‌తో ప్రారంభం కాబోతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా, మరెంతో ఉత్సాహంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే నందమూరి అభిమానుల సందడి కూడా మొదలైంది.
నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో 'అఖండ2' చిత్రం టికెట్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగనన్‌మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు గురజాల జగన్‌మోహన్‌ను కలిసి టికెట్ అందించారు. బాలకృష్ణ అభిమానిగా 'అఖండ2' చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు గురజాల జగన్‌మోహన్.
చిత్తూరులో నందమూరి బాలకృష్ణ పేరుతో బస్ షెల్టర్ నిర్మించడమే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలకు టికెట్ ద్వారా లభించిన మొత్తాన్ని వినియోగించనున్నట్టు నందమూరి అభిమానులు చెబుతున్నారు. టికెట్ వేలం కార్యక్రమంలో నందమూరి బాలకష్ణ చిత్తూరు టౌన్ అధ్యక్షులు ఎల్.డి.నాయుడు, జిల్లా అధ్యక్షుడు మురళినాయుడుతో పాటు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



