ఒకరోజు ఆలస్యంగా అఖండ2.. ఈరోజు ప్రీమియర్స్‌కు అంతా సిద్ధం!
on Dec 4, 2025
- డిసెంబర్ 5 రాత్రి ప్రీమియర్స్
- 'అఖండ2' రిలీజ్‌కి తొలగిన సమస్యలు
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ2' కొన్ని కారణాల ఒకరోజు వాయిదా పడింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలతో ప్రారంభం కావాల్సిన అఖండ తాండవం ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 5న ప్రీమియర్స్‌కి అంతా సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 6న యధాతథంగా సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఓవర్సీస్లో రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బందులు లేవని మేకర్స్ చెబుతున్నారు.
'అఖండ2' డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చెయ్యగా, డిసెంబర్ 4న ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టులో సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు 28 కోట్ల రూపాయలు బకాయి పడినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఆ మొత్తం చెల్లించే వరకు సినిమాను ఆపాలని పిటిషన్ దారులు కోరారు. దీంతో సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సమాచారం మేరకు సినిమాకు సంబంధించిన ఫైనాన్సియల్ సమస్యలు తొలగిపోయాయని తెలుస్తోంది. రిలీజ్‌పై ఉన్న స్టేను తొలగించేందుకు అవసరమైన చెల్లింపులు మేకర్స్ జరిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శుక్రవారం మద్రాస్ హైకోర్టు పని సమయాలు ప్రారంభం కాగానే పిటిషన్ దారులు తమకు రావాల్సిన బకాయి మొత్తం అందిందని కోర్టుకు తెలియజేస్తే వెంటనే స్టే ఎత్తి వేస్తారని తెలుస్తోంది.
స్టే ఎత్తివేయగానే యధాతథంగా ప్రీమియర్స్, సినిమా రిలీజ్‌లను ప్లాన్ చేస్తారు. అంటే ఒకరోజు ఆలస్యంగా అన్ని షోలు ప్రదర్శిస్తారు. దీనికి తగ్గట్టుగానే ఆన్లైన్ బుకింగ్స్‌లో 5వ తేదీ టికెట్లు కనిపించడం లేదు. 6వ తేదీకి సంబంధించిన షోలు ఓపెన్ చేసి ఉన్నాయి. తాజా సమాచారం మేరకు 5వ తేదీ(శుక్రవారం) రాత్రి ప్రీమియర్స్‌తో అఖండ తాండవం ప్రారంభం కాబోతోంది. 6వ తేదీ రెగ్యులర్ షోలు స్టార్ట్ అవుతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



