హిమాలయాల్లో అఖండ 2.. ఏం ప్లాన్ చేస్తున్నారు..?
on Mar 19, 2025
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'అఖండ 2' రూపొందుతోంది. బాలయ్య-బోయపాటి కాంబో కావడంతో పాటు, 'అఖండ' సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అఖండ-2 ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నారు. అందుకే బోయపాటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. (Nandamuri Balakrishna)
అఖండ-2 షూటింగ్ కోసం కెమెరామన్ రాంప్రసాద్ తో కలిసి దర్శకుడు బోయపాటి హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. ఈ లొకేషన్లలో అఘోర గెటప్ లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు, పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని సమాచారం. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు హిమాలయాల్లో ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్లలో అఖండ-2 షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విజువల్ ట్రీట్ లా ఉండేలా ఈ చిత్రాన్ని మలుస్తున్నారట. (Akhanda 2 Thaandavam)
14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతోన్న 'అఖండ-2' దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
