Home

»

Latest News

త‌మిళ‌నాట రేపు రిలీజ‌వుతున్న త‌మిళ 'అఖండ‌'

Jan 27, 2022 10:26AM

 

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. ఆయ‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డ‌మే కాదు, సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత ఆడియెన్స్‌ను తండోప‌తండాలుగా థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది. బాల‌య్య న‌ట విశ్వ‌రూపం, బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ క‌లిసి ఈ సినిమాకు క‌ల్ట్ రేంజ్‌ను చేకూర్చాయి. ఇటీవ‌ల ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన 'అఖండ‌'.. అక్క‌డ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది.

లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌కారం 'అఖండ' త‌మిళ వెర్ష‌న్ రేపు రిలీజ‌వుతోంది. కొన్ని త‌మిళ సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డ‌టం, కొత్త సినిమాలేవీ మార్కెట్‌లో లేక‌పోవ‌డంతో త‌మిళ‌నాడులోని థియేట‌ర్ల య‌జ‌మానులు 'అఖండ' త‌మిళ వెర్ష‌న్‌ను ప్ర‌ద‌ర్శించాల‌నే అమితాస‌క్తితో ఉన్నారు. కాబ‌ట్టి, జ‌న‌వ‌రి 28న త‌మిళ 'అఖండ' ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

Also read: 2023 సంక్రాంతి: మ‌హేశ్ వ‌ర్సెస్ తార‌క్ వ‌ర్సెస్ చ‌ర‌ణ్!?

ఇప్ప‌టికే 'పుష్ప‌'ను త‌మిళ‌నాట రి-రిలీజ్ చేశారు. ఇప్పుడు 'అఖండ' త‌మిళ వెర్ష‌న్ రిలీజ్‌తో త‌మిళ‌నాడులో తెలుగు సినిమాల డామినేష‌న్ క‌నిపిస్తోంది. ఓటీటీలో త‌మిళ స‌బ్‌టైటిల్స్‌తో 'అఖండ' తెలుగు వెర్ష‌న్‌ను చూసిన త‌మిళ తంబిలు థియేట‌ర్ల‌లో త‌మిళ వెర్ష‌న్‌ను చూసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ ప‌వ‌ర్‌-ప్యాక్డ్ యాక్ష‌న్ డ్రామా త‌మిళ‌నాట కూడా త‌న ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also read: ర‌వితేజ బ‌ర్త్ డే స్పెష‌ల్: ప‌దకొండేళ్ళ పాటు 'హిట్' ట్రాక్ రికార్డ్!

క‌వ‌ల సోద‌రులుగా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'అఖండ' మూవీలో స్ట‌న్ శివ‌, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ స‌మ‌కూర్చిన యాక్ష‌న్ బ్లాక్స్ మాస్ ఆడియెన్స్‌లో గుస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అయిన ఈ సినిమాలో ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌, నితిన్ మెహ‌తా, అయ్య‌ప్ప‌శ‌ర్మ, ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర‌ధారులు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com