Home

»

Latest News

2023 సంక్రాంతి: మ‌హేశ్ వ‌ర్సెస్ తార‌క్ వ‌ర్సెస్ చ‌ర‌ణ్!?

Jan 26, 2022 2:02PM

సంక్రాంతి సీజ‌న్ లో విజ‌యాలు అందుకున్న ఈత‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. `ఒక్క‌డు`, `బిజినెస్ మేన్`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి విజ‌యాల‌తో మ‌హేశ్.. `అదుర్స్`, `నాన్న‌కు ప్రేమ‌తో` లాంటి హిట్స్ తో తార‌క్.. `నాయ‌క్`, `ఎవ‌డు` వంటి స‌క్సెస్ ఫుల్ వెంచ‌ర్స్ తో చ‌ర‌ణ్ సంక్రాంతి హీరోలు అనిపించుకున్నారు. అయితే, వీరిలో ఏ ఇద్ద‌రో పొంగ‌ల్ సీజ‌న్ లో పోటీ ప‌డిన సంద‌ర్భాలున్నాయి. మహేశ్ వ‌ర్సెస్ తార‌క్, మ‌హేశ్ వ‌ర్సెస్ చ‌ర‌ణ్ అన్న‌ట్లుగా గ‌తంలో సంక్రాంతి క్లాషెస్ చోటుచేసుకున్నాయి.

క‌ట్ చేస్తే.. 2023 సంక్రాంతికి మ‌హేశ్ వ‌ర్సెస్ తార‌క్ వ‌ర్సెస్ చ‌ర‌ణ్ అన్న‌ట్లుగా ఉండ‌బోతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో మ‌హేశ్ చేస్తున్న మూడో చిత్రాన్ని 2023 పొంగ‌ల్ కి ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. తార‌క్ తో విజ‌న‌రీ కెప్టెన్ కొర‌టాల శివ రూపొందించ‌నున్న సినిమా కూడా అదే సీజ‌న్ కి రావ‌చ్చంటున్నారు. ఇంకోవైపు చ‌ర‌ణ్ తో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీస్తున్న సినిమా 2023 ముగ్గుల పండ‌క్కి రాబోతోంద‌ని నిర్మాత `దిల్` రాజు ప్ర‌క‌టించారు. సో.. అన్ని అనుకూలిస్తే 2023లో మ‌హేశ్, తార‌క్, చ‌ర‌ణ్ త్రిముఖ పోటీ త‌ప్ప‌ద‌న్న‌మాట‌. మ‌రి.. ఈ ప్లానింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com