బాలయ్య-గోపీచంద్ సినిమాలో కీలక పాత్రలో అజయ్ ఘోష్!
on Jan 21, 2022
అచిర కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ అజయ్ ఘోష్. తెలుగు చిత్రసీమలోనే కాకుండా తమిళ చిత్రసీమలోనూ ఆయనకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల పుష్పలో విలన్ కొండారెడ్డి క్యారెక్టర్‌లో అజయ్ ఘోష్ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను బాగా మెప్పించింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన మునుపటి సినిమా 'రంగస్థలం'లో విలన్ జగపతిబాబు అనుచరుడిగా నటించి ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి అదే దర్శకుడు ఎంతో నమ్మకంతో ఇచ్చిన కొండారెడ్డి క్యారెక్టర్‌ను తనదైన స్టైల్‌లో పోషించి ఆకట్టుకున్నారు.
కాగా ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక చిత్రంలో కీలక పాత్రధారిగా ఆయన ఎంపికయ్యారు. ఆ సినిమా.. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న #NBK107. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్, మెయిన్ విలన్‌గా కన్నడ స్టార్ యాక్టర్ దునియా విజయ్, మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు దునియా విజయ్ మామగా ఒక ఎమ్మెల్యే రోల్‌ను అజయ్ ఘోష్ చేయనున్నారు. ఆయనది కూడా నెగటివ్ రోలే.
Also read: 17 ఏళ్ళ తరువాత వేసవి బరిలో చిరు!
నిజానికి గోపీచంద్ మలినేని మునుపటి సినిమా 'క్రాక్'లో అజయ్ ఘోష్ నటించాల్సింది. ఒంగోలు నేపథ్యంలో నడిచే ఆ సినిమాలో వేటపాలెం ప్రాంతానికి చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అజయ్ స్వస్థలం వేటపాలెం కావడం గమనార్హం. అందుకే ఆ సినిమాలో ఓ నెగటివ్ రోల్‌కు ఘోష్‌ను తీసుకోవాలని గోపీచంద్ సంప్రదించాడు. కానీ అప్పటికే వేరే సినిమాలకు కమిట్ అయివున్నందున ఎంత ప్రయత్నించినా 'క్రాక్' మూవీకి డేట్లు సర్దుబాటు చేయలేకపోయారు ఘోష్.
Also read: చైతూతో విడాకుల పోస్ట్‌ను తొలగించిన సామ్.. ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?
ఆ తర్వాత 'క్రాక్'లో పనిచేయలేకపోయినందుకు తెలుగువన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధపడిన అజయ్, డైరెక్టర్ గోపీచంద్‌కు క్షమాపణలు చెప్పారు. అయితే '#NBK107'లోనైనా అజయ్ ఘోష్‌ను నటింపచేయాలని నిర్ణయించుకున్న గోపీచంద్ ఆయనను సంప్రదించడంతో వెంటనే అంగీకరించారు ఘోష్. అలా ఈ సినిమాలోకి ఆయన వచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
