రిలీజ్ కు ముందే ‘బాహుబలి’ రికార్డు బద్దలు!
on Dec 27, 2017

సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించేస్తున్నాడు పవర్ స్టార్. ఆయన 25వ చిత్రమైన ‘అజ్ఙాతవాసి’ జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా అంటే రిలీజ్ తర్వాత వసూళ్ల సునామి సృష్టించడం కామన్. అలాగే... విడుదలయ్యే థియేటర్ల సంఖ్యా పరంగా కూడా గత చిత్రాలను మించి విడుదల చేయడం కూడా నిర్మాతలకు పరిపాటే. ఇక వపర్ స్టార్ సినిమా సరైన హిట్ అయితే... ఇక వచ్చే వసూళ్ల గురించి ప్రత్యేకించి చెప్పాలా? ఆయన సినిమా ఫ్లాప్ అనిపించుకుంటేనే వసూళ్ల వంద కోట్ల దగ్గరకి వచ్చేస్తాయ్. ఇక హిట్ అయితే... రికార్డుల వరదే. విడుదలైన తర్వాత క్రియేట్ అయ్యే రికార్డులను పక్కనపెడితే... పవన్ ‘అజ్ఙాతవాసి’ విడుదలకు ముందే ఎవరూ ఊహించని సరికొత్త రికార్డుని క్రియేట్ చేయనుంది. వివరాల్లోకెళ్తే...
అమెరికా యూనివర్శల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్లో ‘అజ్ఙాతవాసి’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం అజ్ఙాతవాసే కావడం విశేషం. ఆ విధంగా భారతీయ సినిమా స్థాయిని పెంచాడు మన పవర్ స్టార్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. జనవరి 9న ఈ చిత్రం సిటీ వాక్ థియేటర్ లో ప్రదర్శితం కానుంది. అమెరికాలో దాదాపు 209 లొకేషన్స్ లో సుమారు 547 స్క్రీన్స్ పై అజ్ఞాతవాసి ప్రదర్శితం కానుండడం మరో విశేషం. గతంలో బాహుబలి 2 చిత్రం 140 లొకేషన్స్ లో మాత్రమే విడుదలైంది. ఇప్పుడు ఆ రికార్డు ‘అజ్ఞాతవాసి’ బద్దలు చేయనుందన్నమాట. దటీజ్ పవర్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



