మా అబ్బాయి లేడా? ప్రభాస్ కి ఎందుకిస్తాం?
on Dec 27, 2017
నిహారిక వివాహం కొత్త మలుపు తీసుకుంది. ఆమె పెళ్లి ఎఫ్పుడో ఫిక్స్ అయిపోయిందని స్వయంగా ఆమె మామయ్య అల్లు అరవిందే తేల్చిపారేశాడు. ‘నిహారిక నా కొడలు. ఇది ఎప్పుడో ఫిక్సయ్యింది. మా శిరీష్ ఉండగా... ఎవరికో ఇవ్వాల్సిన అవసరం ఏంటి?’ అంటూ బాహాటంగానే చెప్పేశాడట. ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రభాస్, నిహారికాలకు పెళ్లి ఖాయం అయ్యిందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. స్వయంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజే... చిరంజీవిని ఈ విషయంలో కలిశాడనీ... చిరంజీవి కూడా పెళ్లికి సుముఖం వ్యక్తం చేశాడనీ... త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపించాయ్.
అయితే... ఇవి కేవలం గాలి వార్తలనీ... అసలు విషయాన్ని చాలా కూల్ గా చెప్పేశాడు అల్లు అరవింద్. ‘నిహారిక పెళ్లి గురించి మా కుటుంబంలో ఎప్పుడో చర్చలు జరిగాయ్. తనను మా కోడలు చేయాలని ఎప్పుడో చిరంజీవిని అడిగాను. తాను కూడా ‘ఓకే’ అన్నాడు. అన్నయ్య మాటే నాగబాబు మాట. ఇది అందరికీ తెలిసిందే. అయితే... నిహారికాకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదనీ... ఓ రెండేళ్లు గ్యాప్ తీసుకొని చేద్దామని నాగబాబు చెప్పడంతో... ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాం. ఇప్పుడు కాకపోయినా... రెండేళ్ల తర్వాత అయినా.. నిహారికా మా కోడలు. అయినా... మా అబ్బాయ్ అల్లు శిరీష్ ఉండగా... నిహారికాను బయట వారికి ఎందుకిస్తాం. ఒకవేళ ఇవ్వాల్సివస్తే... బయటి హీరోలకు మాత్రం ఇవ్వం’ అని తేల్చిచెప్పేశాడట అల్లు అరవింద్. అదండీ సంగతి.