నేను 20 వేలు పెట్టి చీర కొన్నాను.. మీరు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు!
on Oct 4, 2022
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనక దుర్గమ్మను సినీ నటి హేమ దర్శించుకున్నారు. దుర్గమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయం బయట మీడియాతో హేమ మాట్లాడుతూ "దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మిస్ అయిపోతానేమో.. రాలేనేమో అనుకున్నా. అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు పోటెత్తుతున్నారు.. కానీ ఆఖరి నిమిషంలో దుర్గమ్మ పిలిచింది.. ఇలా వచ్చి దర్శనం చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి." అని అన్నారు.
"మీడియా వాళ్ళు ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి గురించి లైవ్ చూపిస్తునే ఉన్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న మా అందరికీ ఎంత పుణ్యం దక్కిందో.. అలాగే లైవ్‌లో చూస్తూ.. ఇక్కడికి రాలేపోతున్న భక్తులకు కూడా అంతకంటే ఎక్కువ పుణ్యం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్.." అంటూ హేమ చెప్పుకొచ్చారు.
మాట్లాడ్డం పూర్తయ్యి హేమ వెళ్లిపోతుండగా "మేడం మీరెంతమంది వచ్చారు.. టికెట్స్ తీసుకున్నారా? లేదా?" అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించేసరికి హేమ సీరియస్ అయ్యారు. "మేం టికెట్ తీసుకున్నాం. ప్రొటోకాల్ ప్రకారమే దర్శనం చేసుకున్నాం.. వెళుతున్నాం.. అమ్మవారికి హుండీలో 10 వేలు వేశాను.. రూ.20 వేలుపెట్టి చీర కొన్నాను.. మీరు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఎందుకు కాంట్రావర్సీ చేస్తారు? నేను దుర్గమ్మ భక్తురాలిని. ఆమెను దర్శించుకోవడానికి వచ్చాను. కాంట్రవర్సీ కోసం కాదు. ఏంటి తమ్ముడు ఇదీ." అంటూ అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
