Home

»

Latest News

బాల‌య్య చిత్రంలో యాక్ష‌న్ కింగ్, గ్లామ‌ర్ క్వీన్!

Dec 6, 2021 9:59AM

`అఖండ‌` చిత్రంతో బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నారు సీనియ‌ర్ స్టార్ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌. త్వ‌ర‌లో ఈ అగ్ర క‌థానాయ‌కుడు.. `క్రాక్` ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఇందులో బాల‌య్య‌కి జంట‌గా చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ నాయిక‌గా క‌నిపించ‌నుంది. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నాడు.

`రానే వ‌స్తాడు రామ‌య్య‌` అంటున్న బాల‌య్య‌!

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం. అలాగే, గ్లామ‌ర్ క్వీన్ ల‌క్ష్మీ రాయ్ కూడా ప్రాధాన్య‌మున్న వేషంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, ల‌క్ష్మీ రాయ్ ఇప్ప‌టికే బాల‌కృష్ణకి జోడీగా `అధినాయ‌కుడు`(2012)లో అల‌రించింది. మ‌ళ్ళీ ప‌దేళ్ళ త‌రువాత న‌ట‌సింహంతో జ‌ట్టుక‌ట్ట‌నుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అదేవిధంగా.. గోపీచంద్ మ‌లినేని రూపొందించిన `బ‌లుపు`(2013)లోనూ ఈ అమ్మ‌డు ఓ ప్ర‌త్యేక గీతంలో చిందులేసింది.

బాలీవుడ్ బాట‌లో బాల‌య్య `అఖండ‌`?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com