నానితో `వింక్` గర్ల్ !!
on Jan 29, 2019
.jpg)
ఒక్కే ఒక్క `వింక్ ` తో గత ఏడాది సోషల్ మీడియాలో సంచలనం సృస్టించింది కేరళకుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ ముద్దుగుమ్మ నటించిన మలయాళ చిత్రం `ఒరు అడార్ లవ్`. `లవర్స్ `డే గా తెలుగులో నూ అనువాదం కానుంది. ఇదిలా ఉంటే ఈ `వింక్` బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందని టాలీవుడ్ టాక్. నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలకు స్థానముందని అందులో ఒకరిగా ఇప్పటికే మేఘా ఆకాష్ ఎంపికయ్యిందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం మరో నాయికగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ వార్గాలు ముచ్చటించుకుంటున్నాయి. అయితే లుక్ టెస్ట్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే ప్రియ ఎంపిక పై అధికారిక ప్రకటన వెలువడించే అవకాశముందని సమాచారం. కాగా ఫిబ్రవరి నుంచి నాని , విక్రమ్ కుమార్ చిత్రం తాలూకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



