మహేష్ ఇంటికొచ్చాడు!
on Jan 29, 2019
.jpg)
సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో వున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న 'మహర్షి' సినిమా కోసం అక్కడ మకాం వేశాడు. మధ్యలో శ్రీమతి నమ్రత పుట్టినరోజుకు కూడా ఇంటికి రాలేదు. బిజీ బిజీగా సినిమా షూటింగ్ చేశాడు. సోమవారంతో 'మహర్షి' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయింది. దాంతో మహేష్ ఇంటికొచ్చాడు. హైదరాబాద్ వచ్చాడు. మహేష్ రాకతో నమ్రత ఫుల్ హ్యాపీ. ఓ వారం రోజులు మహేష్ బాబు విశ్రాంతి తీసుకోనున్నాడు. 'మహర్షి' షూటింగుకు బ్రేక్ ప్రకటించాడు. ఈ విరామంలో తదుపరి సినిమాకు సంబంధించిన కథచర్చల్లో పాల్గొననున్నాడు. సుకుమార్ సినిమా కథను ఫైనలైజ్ చేయడంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోయే కథ గురించి మహేష్ డిస్కస్ చేస్తాడట. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న 'మహర్షి' ఏప్రిల్ నెలాఖరున విడుదల కానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 'శ్రీమంతుడు' తరహా సందేశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని 'మహర్షి' టీమ్ నమ్మకంతో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



