తెలుగు ప్రేక్షకులు చూస్తారా ?!
on Jul 26, 2016
ఇప్పుడిప్పుడే అడల్ట్ సినిమాలకు అలవాటుపడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. మారుతి డబుల్ మీనింగ్ డైలాగ్ సినిమాలు అలవాటు చేయగా.. బాలీవుడ్ పుణ్యమా అని అడల్ట్ మూవీస్ రుచి మరిగారు. "గ్రాండ్ మస్తీ" లాంటి బీగ్రేడ్ ఎంటర్ టైనర్ హైద్రాబాద్ లో మొదటి పది రోజులు హౌస్ ఫుల్ షోలతో ప్రదర్శితమవ్వడమే అందుకు నిదర్శనం. అందుకే ఇప్పుడు స్ట్రయిట్ గా తెలుగులోనే ఓ అడల్ట్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "హంటర్" అనే సినిమాను తెలుగులో నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించనున్నాడు. సెక్స్ కి ఎడిక్ట్ అయిన ఓ యువకుడి జీవితం అతడి చెడు బుద్ధి కారణంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథాంశం. హీరోయిన్ గా రెజీనా మరియు రాశీఖన్నాల పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ.. రెజీనా ఫైనల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరి మన తెలుగు ఆడియన్స్ ఈ అడల్ట్ ఎంటర్ టైనర్ ను ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



