మంచు సినిమా నుంచి మెగా హీరోయిన్ ఔట్!
on Jul 26, 2016
"మంచు అబ్బాయి సినిమాలో మెగా హీరోయిన్" అనే వార్త వచ్చి ఇంకా రెండు వారాలు కూడా అవ్వలేదు. అప్పుడే అమ్మడు ఆ సినిమా నుంచి తప్పుకొందని మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఎప్పుడో "డేగ" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రజ్ఞా జైస్వాల్ కు మూడో సినిమా "కంచె"తోనే కథానాయికగా పేరొచ్చింది. పేరైతే వచ్చింది కానీ ఆఫర్లు మాత్రం రాలేదు అమ్మడికి. ఉన్నట్టుండి నాగార్జునతో "ఓమ్ నమో వెంకటేశాయ", మంచు మనోజ్ సరసన మరో సినిమాలో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మరి ఏమయ్యిందో తెలియదు గానీ.. మొదట బాగా నచ్చేసి ఒకే చేసిన సబ్జెక్ట్ ఇప్పుడు నచ్చలేదని చెప్పేసి చాలా డీసెంట్ గా ప్రొజెక్ట్ నుంచి తప్పుకొంది. రెగ్యులర్ షూటింగ్ కి వెళదాం అనుకొనే సరికి ఇలా హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మనోజ్ అండ్ టీం ఇంకో కొత్త హీరోయిన్ ను వెతుక్కోనే పనిలో పడ్డారట!