తమిళనాట... విశాల్ 'శ్రీమంతుడు'
on Nov 26, 2018
మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'శ్రీమంతుడు'. గ్రామాల దత్తత, ఎంతో కొంత గ్రామాలకు తిరిగి ఇవ్వాలనే కథాంశంతో సినిమా రూపొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామం, తెలంగాణలో మరో గ్రామం దత్తత తీసుకోవడం ద్వారా వెండితెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ తాను శ్రీమంతుడినే అని మహేశ్ లోకానికి చాటిచెప్పారు. తెలుగు 'శ్రీమంతుడు' మహేశ్ అయితే... తమిళ 'శ్రీమంతుడు' విశాల్. ఆయన తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయడం లేదు. తమిళనాట తుఫాను ధాటికి సర్వస్వం కోల్పోయిన తంజావూరు జిల్లాలో పట్టుక్కొటాయి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు విశాల్ ప్రకటించారు. ఆ గ్రామాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే బాధ్యత తనదని విశాల్ తెలిపారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ద్వారా నిజజీవితంలో విశాల్ శ్రీమంతుడు అయ్యారు. సామజిక సేవకు విశాల్ ముందడుగు వేయడం ఇది తొలిసారి కాదు. గతంలో చెన్నైలో వరదలు విలయతాండవం చేసినప్పుడు ప్రజలకు సహాయం చేశారు.