మహేశ్‌తో సెల్ఫీ తీసుకోవాలని!
on Nov 26, 2018
స్టార్ హీరోలకు అభిమానులు కోట్లలో వుంటారు. ప్రేక్షకులందరూ తమ అభిమాన హీరోను ఒక్కసారైనా కాలవాలనీ, వీలయితే ఓ సెల్ఫీ తీసుకోవాలని కోరుకోవడం సహజం. ఎంతోమంది హీరోలను కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. కానీ, కొంతమంది తీసుకునే సెల్ఫీలు, ఫొటోలు స్పెషల్‌గా నిలుస్తాయి. మీరు చూస్తున్నది అటువంటి ఫొటోనే. అందులో మహేశ్‌కు నమస్కరిస్తున్న బామ్మగారి పేరు రేలంగి సత్యవతి. ఆమె వయసు 106 ఏళ్లు. రాజమండ్రికి చెందిన ఆమె మహేశ్ వీరాభిమాని. ఒక్కసారైనా తన అభిమాన హీరోను కలిసి ఫొటో దిగాలని, సెల్ఫీ తీసుకోవాలని బామ్మగారు ఆశపడ్డారు. రేలంగి సత్యవతి విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు 'మహర్షి' సెట్స్‌కు ఆమెను పిలిపించుకుని కలిశారట. హైదరాబాద్‌లో 'మహర్షి' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమెతో కాసేపు మాట్లాడారని తెలిసింది.