పీరియాడిక్ మూవీ లో విజయ్ దేవరకొండ
on Oct 18, 2023
.webp)
విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు పరశురామ్ అండ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ల్లో ఏకధాటిగా పాల్గొంటున్న విజయ్ ఇప్పుడు మరో సినిమా కి పచ్చ జెండా ఊపాడు. విజయ్ అభిమానులు ఆనందించే విషయం ఏంటంటే ఆ మూవీ రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండబోతుంది.
2018 వ సంవత్సరంలో విజయ్ హీరోగా వచ్చిన టాక్సీవాలా మూవీ మంచి విజయాన్నే సాధించింది. ఈ మూవీ ద్వారా రాహుల్ సంక్రుత్యియన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ మూవీ లో విజయ్ నటన తో పాటు రాహుల్ డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. రాహుల్ లేటెస్టుగా నాచురల్ స్టార్ నాని తో శ్యామ్ సింగరాయ్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు విజయ్ అండ్ రాహుల్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతుంది. ఆ మూవీ అలాంటి ఇలాంటి మూవీ కాదు ఒక పీరియాడిక్ కథతో ఆ మూవీ తెరకెక్కబోతుంది. విజయ్ దేవరకొండ నట జీవితంలోనే మొట్టమొదటి సారిగా పీరియాడిక్ కథ తో ఆ చిత్రం రూపుదిద్దుకోబోతుంది. ఆల్రెడీ రాహుల్ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసాడు. ఈ హిట్ కాంబో లో మూవీని మైత్రి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
కాగా దేవరకొండ తన గత చిత్రం ఖుషి తో పాటు అంతకు ముందు వచ్చిన లైగర్ సినిమాల రిజల్ట్ విషయంలో డల్ అయ్యాడు. సమంత ,విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి మూవీ మీద అలాగే పూరి తో చేసిన లైగర్ మీద విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ కొట్టాయి. ఇప్పుడు విజయ్ తిరిగి తన సత్తా చాటాలని వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కాగా విజయ్ దేవర కొండ ,రాహుల్ ల సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధం లో సెట్స్ మీదకి వెళ్లనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



