లవర్స్‌డేకి లవర్‌గా విజయ్ దేవరకొండ
on Nov 25, 2019
'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'వరల్డ్ మోస్ట్ ఫేమస్ లవర్'. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్లు. కెఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎ వల్లభ సినిమా నిర్మిస్తున్నారు. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' తర్వాత క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది.
రౌడీస్ అని విజయ్ దేవరకొండ ముద్దుగా పిలుచుకునే అభిమానులకు లవర్స్ డే కానుకగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14న 'వరల్డ్ మోస్ట్ ఫేమస్ లవర్' సినిమాను రిలీజ్ చేయనున్నారు. లవర్స్‌డేకి లవర్‌గా విజయ్ దేవరకొండ వస్తాడన్నమాట. ఒక షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ప్రారంభించారు. ఆల్రెడీ డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది. 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రమిది. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.