సంక్రాంతి తరువాతే బాలయ్య కొత్త చిత్రం!
on Dec 16, 2021

`అఖండ`తో మరోసారి బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. కరోనా సెకండ్ వేవ్ అనంతరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `అఖండ`.. రాబోయే పెద్ద చిత్రాలకు ఊపిరి పోసింది.
Also Read:దేవుడున్నాడు.. చూద్దాం ఏం జరుగుతుందో!
ఇదిలా ఉంటే.. `అఖండ` తరువాత మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు సిద్ధమయ్యారు బాలయ్య. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని రూపొందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన చెన్నై పొన్ను శ్రుతి హాసన్ దర్శనమివ్వనుంది. `అఖండ`కి బాణీలు అందించిన యువ సంగీత సంచలనం తమన్ ఈ భారీ బడ్జెట్ మూవీకి కూడా స్వరాలు సమకూర్చనున్నాడు.
Also Read:అప్పుడు బాలయ్యతో.. ఇప్పుడు తారక్ తో!
కాగా, జనవరిలో బాలయ్య - గోపీచంద్ మూవీ సెట్స్ పైకి వెళుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సంక్రాంతి తరువాతే అంటే జనవరి 20న ఈ యాక్షన్ డ్రామాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఆపై చకచకా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `అఖండ` అనంతరం వస్తున్న ఈ సినిమాతో బాలయ్య మరో సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



