వరుణ్ తేజ్ ఇండో కొరియన్ కొత్త మూవీ అప్ డేట్
on Jan 29, 2025
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun Tej)కి రొటీన్ సినిమాలు చెయ్యకుండా,విభిన్నమైన సినిమాలు చేస్తాడనే పేరు ప్రేక్షకుల్లో ఉంది.గత ఏడాది చివరలో 'మట్కా'(Matka)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ మూవీ పరాజయం చెందినా కూడా భిన్నమైన ఏజ్ గ్రూపుల్లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.ఈ మూవీ తర్వాత వరుణ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మూవీ ఫేమ్ 'మేర్లపాక గాంధీ'(Merlapaka Ghandhi)డైరెక్షన్ లో చెయ్యబోతున్నాడు.
ఈ మూవీ ఇండో కొరియన్ నేపథ్యంలో జరిగే కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.వియాత్నంలో లొకేషన్ వేటలో ఉన్నట్టుగా తెలపడంతో పాటుగా మార్చి నుంచి షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వ్యవహరిస్తోంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర సంస్థల్లో యువీ క్రియేషన్స్ కూడా ఒకటి. ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన ఆ సంస్థ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో విశ్వంభర(Vishwambhara)చేస్తున్న విషయం తెలిసిందే.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)