ఇది నార్మల్ కాదు.. కోర్టు తీరుపై పూనమ్ కౌర్ అసహనం!
on Jan 29, 2025
కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగిన 162 రోజుల తర్వాత దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు విధిస్తూ కోల్‌కతా లోని సియాల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసు కోల్‌కతా హైకోర్టుకి చేరింది. తాజాగా ఈ కేసుపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. (Poonam Kaur)
పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జీకర్ ఘటనపై స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. హత్యాచార ఘటనలను సాధారణంగా చూడటం లేదా సాధారణ కేసుగా పరిగణించడం కరెక్ట్ కాదని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అరుదైన కేసు కాదని కోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. హత్యాచార ఘటనను మన దేశంలో ఒక సాధారణ విషయంగా మార్చాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టాలని పూనమ్ కౌర్ కోరారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)