‘కంచె’ ట్రైలర్..మెగా హీరో కేక పెట్టించాడు
on Sep 1, 2015
గన్ను పట్టుకుని కదన రంగంలో చెలరేగిపోయాడు వరుణ్ తేజ్. రెండు నిముషాలు సాగే ‘కంచె’ ట్రైలర్ తోనే వావ్ అనిపించాడు క్రిష్. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో అల్లిన ఈ ప్రేమకథ అటు గగుర్పొడిచే యుద్ధ సన్నివేశాలతో, ఇటు మనసుని హత్తుకునే ప్రేమ సన్నివేశాలతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ట్రెయిలర్ చూస్తేనే కలుగుతోంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రెయిలర్‌ని కొద్ది సేపటి క్రితం రాజమౌళి తన ట్విట్టర్ పేజీ ద్వారా రిలీజ్ చేశాడు.ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో ముందుకి వచ్చే క్రిష్ ఈసారి కూడా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని ఎంచుకుని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ఆ కాలం నాటి లుక్‌లో చూడ్డానికి బాగుండడమే కాకుండా, నటుడిగాను రాణించాడని ట్రెయిలర్‌ని బట్టి తెలుస్తోంది. ట్రైలర్ ద్వారా కంచె కథ తెలియాలంటే అక్టోబర్ 2న థియేటర్ లో చూడమని చెప్పకనే చెప్పాడు.