అర్థరాత్రికి పవర్ స్టార్ 'సర్దార్' టీజర్
on Sep 1, 2015
గబ్బర్‌సింగ్ సీక్వెల్‌గా రూపొందుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ టీజర్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ రెడీ అయ్యిందని, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవర్ ఫేం బాబీ రూపొందిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రారంభించి చాలా కాలం అయింది. అసలు వస్తుందా రాదా అన్న అనుమానలు పెరిగిపోయాయి. అందుకే ఇటీవల ఫస్ట్ లుక్ లు, ఫోస్టర్లు ఇలా హడావుడి చేస్తున్నారు. అందులో భాగంగా, పవన్ పుట్టిన రోజ అకేషన్ ను పురస్కరించుకుని ఈ అర్థరాత్రికి టీజర్ వదులుతున్నారు.