తమ్ముడి చేతిపై 'బేబీ' టాటూ
on Jul 31, 2023
ఇప్పుడు ఎక్కడ చూసిన "బేబీ" హీరోయిన్ వైష్ణవి పేరు మారుమోగిపోతోంది. బేబి సినిమాను చూసిన జనాలు ఈ అమ్మడి నటనకు ఫిదా ఐపోతున్నారు . హీరోయిన్‌గా మొదటి మూవీతో తన నటనతో వావ్ అనిపించిందని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిన్న పెద్దా సెలబ్రిటీస్ అంతా కూడా ఆమెతో ఫోటోలు కూడా దిగుతున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా బేబీని తెగ పొగిడేశారు. భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుందని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు అభిమానుల నుంచి పిచ్చ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది.
తన పాటలతో, టిక్ టాక్ వీడియోస్ తో , ఇన్‌స్టా రీల్స్ తో, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో చిన్న సైజు సెలబ్రిటీ కాస్త బిగ్ సైజు సెలబ్రిటీ స్టేటస్ కి వచ్చేసింది . ఈమె నటనలోని టాలెంట్ ని చక్కగా వాడుకుని బేబీ లాంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తీసి బంపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ . అలాంటి వైష్ణవికి ఒక తమ్ముడు ఉన్నాడు. తను తన అక్క సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన మీద మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చే కామెంట్స్ చేసాడు కూడా. తన చేతి మీద తన అక్క పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుని తన అక్క మీద ప్రేమను చూపించాడు. ఇదంతా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది వైష్ణవి. "నీ నటన చూసి నేను చాల గర్వంగా ఫీలవుతున్నాను...నువ్వు ఎంతో ఫోకస్డ్ గా ఉంటూ నీ లైఫ్ లో మంచి సక్సెస్ సాధించావ్.. ఐ లవ్ యూ అక్కా" అని వాళ్ళ తమ్ముడు కాప్షన్ పెట్టుకున్నాడు. వైష్ణవి యూట్యూబ్ సిరీస్ ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి మూవీస్ లోకి ట్రై చేస్తూ వచ్చింది. ‘అలావైకుంఠపురంలో’ బన్నీ చెల్లెలిగా నటించింది. వైష్ణవి చైతన్య కూచిపూడి డాన్సర్ కూడా. ఈమె చాలా కవర్ సాంగ్స్ కూడా చేసింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కోసం డైరెక్టర్లు, యాక్టర్లు క్యూ కడతారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
