ద్యా... వుడా! అదేం సెల్ఫీ తల్లీ...?
on Aug 21, 2017
ఏదైనా మంచి సీనరీ కనిపించినప్పుడు అక్కడ సెల్ఫీ దిగాలనిపిస్తుంది. లేదా... ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు సెల్ఫీ దిగాలనిపిస్తుంది. కానీ... నటి, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిట్ కన్నా అభిరుచి మాత్రం వేరేలా ఉంది. ఆమె ఓ విచిత్రమైన సెల్ఫీ దిగింది. ఆ సెల్ఫీ చూస్తే... ఎవరైనా కళ్లు, ముక్కు రెండూ మూసుకోవాల్సిందే. ఇంతకీ ట్వింకిల్ దిగిన సెల్ఫీ ఏంటా అనుకుంటున్నారా?
ముంబయ్ బీచ్ లో ట్వింకిల్ ఓ సెల్ఫీ దిగింది. అదేదో సముద్రంతో దిగిన సెల్ఫీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే... ఆమె ముంబయ్ బీచ్ లో నిలబడి... అక్కడ దూరంగా బహిరంగ మల విసర్జన చేస్తున్న వ్యక్తి కనిపించేట్లు ఓ సెల్ఫీ దిగింది. అంతటితో ఆగకుండా... దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్. పైగా.. ‘నా భర్త.. అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా 2’ చిత్రంలో ఫస్ట్ సీన్ ఇదే.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయొద్దని.. ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్’ పేరిట మొత్తుకుంటున్నా.. నా భర్త అక్షయ్ దీనిపై అవగాహన కల్పించేందుకు సినిమా తీసినా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకే ఆవేదనతో ఈ పోస్ట్ పెట్టాను’ అని కామెంట్ కూడా పెట్టింది ట్వింకిల్.
దీనిపై ఓ జర్నలిస్ట్ స్పందిస్తూ... ‘అంతగా తొందరగా వస్తే... దగ్గరలో ఉన్న టాయిలెట్ కి వెళ్లొచ్చు కదా’ అని కామెంట్ పెట్టాడు. దానిపై కూడా ట్వింకిల్ స్పందిస్తూ .. ‘నిజమే... అక్కడ్నుంచి ఏడెనిమిది నిమిషాలు నడిస్తే... పబ్లిక్ టాయిలెట్ ఉంది. కానీ... మనవాళ్లకు అక్కడికి వెళ్లడం ఇష్టం ఉండదు. ప్రకృతి ఆస్వాదిస్తూ... ఎక్కడపడితే అక్కడ పని కానిచ్చేస్తారు. ప్రకృతి పాడుచేస్తున్నామన్న సంగతి మాత్రం వాళ్లకు గుర్తుండదు’ అని రిప్లై ఇచ్చింది.
తన భర్త అక్షయ్ కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ చిత్రం... బహిరంగ మల, మూత్ర విసర్జనపై అవగాహన కల్పించే కథాంశంతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరి బాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వంద కోట్ల వసూళ్లు సాధించిన అక్షయ్ కుమార్ 8వ చిత్రం ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ కావడం విశేషం. 11 వందకోట్ల క్లబ్ లో చేరిన సినిమాలతో సల్మాన్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే... 8 వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలతో అక్షయ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇదిలావుంటే... ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో అక్షయ్ ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా 2’ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన భార్య ట్వింకిల్ ఖన్నా...సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫొటో... ‘పార్ట్2’ న్యూస్ ని ఖరారు చేసేసింది.
Also Read