'దేవర'పై దారుణమైన ట్రోల్స్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!
on Nov 12, 2024
తమ అభిమాన హీరో సినిమాపై ట్రోల్స్ వస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు లేదా ఫైర్ అవుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన 'దేవర'పై ట్రోల్స్ వస్తుంటే ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఓ కారణముంది. (Devara On OTT)
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ, ఊహించని విధంగా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇక ఇటీవలే 'దేవర' ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దేవరపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇందులోని పలు సన్నివేశాలను కొందరు ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ కావట్లేదు. పైగా ఇలాంటి ట్రోలింగ్ కంటెంట్ తో రూ.500 కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదని, ఈ విషయంలో ఎన్టీఆర్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తూన్నారు. (Devara On Netflix)
అదే సమయంలో కొందరు ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిసారీ స్టార్డమ్ తో సినిమాని కాపాడటం కష్టమని, కంటెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ లేపే సినిమాలే తప్ప, ఎన్టీఆర్ ని లేపే సినిమాలు రావట్లేదని.. యునానిమస్ టాక్ వచ్చే సాలిడ్ స్క్రిప్ట్ తో రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 'దేవర-2'ని పక్కన పెట్టి, మిగతా సినిమాల స్క్రిప్ట్ లపై ఫుల్ ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read