త్రివిక్రమ్ కీలక నిర్ణయం.!!
on Jul 25, 2018
'అరవింద సమేత' మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.అజ్ఞాతవాసి ఆశించిన ఫలితాలివ్వకపోవటంతో త్రివిక్రమ్ ఈ చిత్రం విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు.కొంత కాలం క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.కానీ సినిమా నుంచి ఓ పిక్ లీక్ అయింది.
.jpg)
గాయాలతో ఉన్న నాగబాబును ఎన్టీఆర్ కారులో తీసుకెళుతున్న పిక్ ఒకటి బయటకు వచ్చింది.పిక్ లీక్ కావడంతో త్రివిక్రమ్ చిత్ర యూనిట్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.ఇలాంటి లీక్స్ మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో త్రివిక్రమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపై చిత్ర సభ్యులెవరూ సెట్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకుని రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనుమతి ఉంటేనే మొబైల్ ఫోన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లీకుల బారి నుంచి కాపాడుకోవాలంటే ఆమాత్రం ఆంక్షలు తప్పవు కదా లేదంటే చిత్రంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



