మరో షాక్.. త్రిషకి కరోనా.. ఆలస్యంగా వెలుగులోకి..
on Jan 8, 2022

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, సత్యరాజ్, తమన్, మంచు లక్ష్మి, మీనా, విశ్వక్ సేన్, మంచు మనోజ్ కరోనా బారిన పడగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ త్రిష కూడా తనకి కరోనా సోకిందని తెలిపింది. కొద్దిరోజులగా కరోనాతో పోరాడుతున్నానని చెప్పింది.
తనకు కరోనా సోకినట్టు తాజాగా త్రిష సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, న్యూ ఇయర్ కి ముందు తనకి కరోనా పాజిటివ్ అని తేలిందని త్రిష తెలిపింది. కొద్దిరోజులుగా ఎంతో బాధని అనుభవించానని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన ఆరోగ్యం మెరుగుపడటానికి వ్యాక్సిన్లే కారణమని చెప్పిన త్రిష.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని కోరింది. త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని, తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని త్రిష పోస్ట్ చేసింది.

త్రిష త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాతో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్ట్ లు పెడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



