నయన్ కి అప్పుడు రీమాసేన్.. ఇప్పుడు సమంత!
on Jan 8, 2022

విజయ్ సేతుపతి, నయనతార, సమంత.. నటనలో ముగ్గురూ ముగ్గురే. అలాంటి ఈ త్రయం ఒకే సినిమాలో కలిసి నటిస్తే.. చూపరులకు కనువిందే. తమిళ చిత్రం `కాతు వాకుల రెండు కాదల్` కోసం సేతుపతి, నయన్, సామ్ జట్టుకట్టారు. కోలీవుడ్ కెప్టెన్ విఘ్నేశ్ శివన్ రూపొందించిన ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 14న జనం ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో సమంత నెగటివ్ రోల్ లో కనిపించబోతోందట. సేతుపతి, నయన్ ప్రేమకి తనే విలన్ అని బజ్. అదే గనుక నిజమైతే.. `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` వెబ్ - సిరీస్ తరువాత బ్యాడీగా సమంత కనిపించేది ఇందులోనే అని చెప్పొచ్చు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో నయన్ నటించిన రొమాంటిక్ డ్రామా `వల్లభ`లోనూ రీమాసేన్ ప్రతినాయికగా దర్శనమిచ్చింది. శింబు, నయనతార ప్రేమకథలో తనే విలన్. కట్ చేస్తే.. ఇప్పుడు నయన్ కి రీమాసేన్ తరువాత సమంత రూపంలో మరోసారి లేడీ విలన్ ఎదురవుతోందన్నమాట.
Also Read: రవితేజతో ఫారియా, ప్రియాంక రొమాన్స్!
మరి.. సామ్ రోల్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



