ఫస్ట్ లుక్ రివ్యూ: టచ్ చేసి చూడు
on Dec 29, 2017
రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది రాజా ది గ్రేట్‌తో తన ఖాతాలో విజయాన్ని వేసుకున్నాడు. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టి వెంటనే జోరు పెంచి రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. విక్రమ్ సిరి దర్శకత్వంలో టచ్ చేసి చూడు అందులో ఒకటి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బోల్తాపడిన కారు వద్ద కళ్లజోడు పెట్టుకుని రఫ్‌లుక్‌తో రవితేజ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తోన్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలిస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.. ఆయనకు జోడిగా రాశీఖన్నా, సీరత్‌కపూర్ నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ మూవీని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.