టాలీవుడ్లో 'ప్లాస్టిక్' ఫ్యామిలీ
on Aug 9, 2016
తెలుగు సినీ పరిశ్రమే `కుటుంబాలు`తో నిండిపోయింది. మెగా ఫ్యామిలీ ఒకవైపు, నందమూరి ఫ్యామిలీ ఇంకోవైపు, దగ్గు బాటి ఫ్యామిలీ మరోవైపు... ఇలా ఇక్కడా కుటుంబ రాజకీయాలే! అయితే ఈమధ్య ఓ ఫ్యామిలీని `ప్లాస్టిక్ ఫ్యామిలీ` అని పిలుచుకొంటున్నారు కొంతమంది సీనీ అభిమానులు. ప్లాస్టిక్ ఫ్యామిలీ అంటే మరేదో కాదు. వాళ్లింట్లో ప్లాస్టిక్ సర్జరీలు ఎక్కువగా జరిగాయట. అందుకే ఆ పేరు పెట్టారు సరదాగా. ఇప్పటి వరకూ ఇద్దరు హీరోలు తమ మొఖ కవళికలను సర్జరీలతో మార్చుకొన్నారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచే మరో హీరో కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నాడు. ఈమధ్యే సదరు హీరో సినిమా విడుదలైంది. తెరపై బాబు గారిని చూస్తే.. గత సినిమాకీ, ఈ సినిమాకీ తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. అదంతా ప్లాస్టిక్ సర్జరీ మహత్య్మమే అని టాక్. ఇదే విషయం బాబు గారిని అడిగితే ''సర్జరీ లేదు.. పాడూ లేదు.. నేను యోగా చేశా. జిమ్‌కి వెళ్లా'' అని కవరింగులు ఇస్తున్నాడు. ఫ్యాన్సంతా ''బాబు గారు.. బంగారం లా మెరిసిపోతున్నారు'' అని ముచ్చటపడిపోతుంటే నాన్ ఫ్యాన్స్ మాత్రం ''ఇలా ఎంత కాలం ఈ హీరోల్ని రుద్దుతారు'' అంటూ నెత్తి కొట్టుకొంటున్నారు. కొంతమందైతే ఫేస్ బుక్‌లో కోతి, చింపాంజీల ఫొటోలతో... ఆయా హీరోల ఫొటోలు జత చేసి `ఆపరేషన్‌కి ముందూ.. తరవాత` అంటూ.. జోకులు పేలుస్తున్నారు. ఏంటో... ఫేస్ బుక్, ట్విట్టర్లు వచ్చాక.. హీరోలపై ఈ తరహా జోకులు ఎక్కువైపోయాయి. ఇలాంటి కామెంట్లు చూసి ఆయా హీరోలు కూడా బావురు మంటున్నార్ట. ఇంతకీ ఆ ప్లాస్టిక్ ఫ్యామిలీ ఎవరిదో మీకు అర్థమైందా??