ఓజీ అలా.. రాజా సాబ్ ఇలా.. ఎందుకిలా..?
on Sep 28, 2025

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. (Raja Saab Trailer)
ఈ మధ్య కాలంలో చిత్ర విడుదల తేదీకి రెండు మూడు వారాల ముందు కూడా పెద్ద సినిమాల ట్రైలర్లు రావట్లేదు. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ ట్రైలర్ అయితే.. రిలీజ్ డేట్ కి సరిగ్గా మూడు రోజల ముందు వచ్చింది. అలాంటిది విడుదల తేదీకి ఏకంగా మూడు నెలల ముందుగానే 'రాజా సాబ్' ట్రైలర్ వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంత త్వరగా ట్రైలర్ విడుదలవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఉన్నారు.
Also Read: 200 కోట్ల క్లబ్ లో ఓజీ.. పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్...
కాగా, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 'రాజా సాబ్' నుంచి సాంగ్ ని కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



