Home

»

Latest News

200 కోట్ల క్లబ్ లో ఓజీ.. పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్...

Sep 28, 2025

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ'.. సెప్టెంబర్ 25న విడుదలై, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. (They Call Him OG)

 

ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.144 కోట్ల గ్రాస్ రాబట్టిన ఓజీ మూవీ.. రెండో రోజు రూ.27 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి రూ.200 కోట్ల గ్రాస్ మూవీ ఇదే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో వసూళ్ళు రాబడుతున్న ఈ చిత్రం.. మునుముందు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశముంది.(OG Collections)

 

నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. పైగా, ప్రస్తుతం దసరా సెలవులు కావడం.. ఓజీకి కలిసొచ్చే అంశం. ప్రస్తుత జోరు చూస్తుంటే.. త్వరలోనే ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేయడం ఖాయమని చెప్పవచ్చు. మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com