తాడోపేడో తేల్చుకుంటారా..లేక కాంప్రమైజా
on Jul 23, 2024
అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)నితిన్(nithiin) మూవీ లవర్స్ లో ఈ ఇద్దరి సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ కూడా ఉంది. గత కొంత కాలంగా ఇద్దరికీ సరైన హిట్ లేదు. ఈ క్రమంలో హిట్ చాలా అవసరం. మరి ఆ హిట్ ని కొంచం గ్యాప్ తో అందుకుంటారా లేక తాడోపేడో తేల్చుకుంటారా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. వాటి వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటో చూద్దాం.
చై ప్రస్తుతం తండేల్(thandel)తో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. ఇక నితిన్ అప్ కమింగ్ ప్రాజక్ట్ రాబిన్‌హుడ్(robinhood).ఇది కూడా శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకొని డిసెంబర్ లో విడుదలకి సన్నాహాలు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ రెండిటికి రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా స్టార్స్ తో పోటీ ఏర్పడ బోతుంది. డిసెంబర్ లోనే పుష్ప 2(pushpa 2) గేమ్ ఛేంజర్(game changer)లు అడుగుపెట్టబోతున్నాయి. ఆరు న పుష్ప వస్తుంది. అగస్ట్ నుంచి వాయిదా పడి చివరకి ఆ డేట్ మీద కూర్చుంది. ఇక క్రిస్మస్ కి రావడానికి గేమ్ చేంజర్ హంగులని అద్దుకుంటుంది. ఈ విషయాన్ని దిల్ రాజు ఇటీవలే చెప్పాడు కూడా. అదే విధంగా ఇండియా లోనే మోస్ట్ మల్టి స్టారర్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న కన్నప్ప కూడా డిసెంబర్ లో రాబోతుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని విష్ణు పదే పదే చెప్తూనే వస్తున్నాడు. పైగా ప్రభాస్ కూడా ఉన్నాడు. అదే విధంగా అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ లాంటి పలు భాషలకి చెందిన టాప్ స్టార్స్ ఉన్నారు.
మరి ఇన్ని అగ్ర హీరో ల భారీ సినిమాలు ఉండగా నాగ చైతన్య, నితిన్ డిసెంబర్ లో వస్తే థియేటర్స్ పరంగా ఇబ్బందిని ఎదుర్కొనవచ్చు.ఆ ప్రభావం కలెక్షన్ల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ నుంచి తప్పుకుంటే ఇద్దరి సినిమాలకి ఉపయోగం అనే చర్చ నడుస్తుంది. హిట్ కంపల్సరీ అయిన వేళ రిస్క్ అవసరం అనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి కూడా వ్యక్తం అవుతుంది కార్తికేయ 2 తో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి తండేల్ కి దర్శకుడు కాగా గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది. రాబిన్‌హుడ్ కిఅపజయమే ఎరుగని వెంకీ కుడుముల దర్శకుడు కాగా మైత్రి మూవీస్ నిర్మాతలు. పుష్ప 2 కూడా వాళ్లదే.
Also Read