తల్లితండ్రులపై కేసు పెట్టిన స్టార్ హీరో విజయ్!
on Sep 20, 2021
సొంత తల్లిదండ్రులపై కేసు పెట్టి తమిళ స్టార్ హీరో విజయ్ సంచలనానికి తెరలేపారు. తన తల్లిదండ్రులు స్థాపించిన రాజకీయ పార్టీకి తనకి సంబంధం లేదని.. అనుమతి లేకుండా వారు తన పేరును ఉపయోగిస్తున్నారని విజయ్ చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు.
విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ గత ఏడాది 'ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఇందులో విజయ్ తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రెటరీగా, విజయ్ తల్లి శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై గతంలోనే స్పందించిన విజయ్.. తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు నేరుగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తన ఫ్యాన్స్ ఎవరూ ఆ పార్టీలో చేరవద్దని చెప్పారు. అంతేకాదు, ఆ పార్టీ కోసం తన పేరు, ఫొటోలు, ఫ్యాన్స్ క్లబ్‌ను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారు.
ఇక ఆదివారం తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో విజయ్ కేసు పెట్టారు. ఇకపై తన పేరుతో ఎటువంటి కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని.. అలాగే తన పేరుతో స్థాపించిన 'ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' రాజకీయ పార్టీని రద్దు చేయాలని విజయ్ కోర్టును కోరారు. ఈ కేసుపై సెప్టెంబర్ 27న కోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read