చిరంజీవి భార్య మేఘనా రాజ్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతోందా?
on Sep 20, 2021
నటి మేఘనా రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయి. బిగ్ బాస్ కన్నడ 4 విన్నర్ ప్రథామ్తో ఆమె రెండో పెళ్లి జరగనున్నదంటూ పలు యూట్యూబ్ చానళ్లు రిపోర్ట్ చేశాయి. ఈ రూమర్స్‌తో ఆగ్రహానికి గురైన ప్రథామ్ ఆ యూట్యూబ్ చానల్స్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా, వాటిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ హెచ్చరించాడు.
మేఘనా రాజ్ భర్త, పాపులర్ కన్నడ నటుడు చిరంజీవి సర్జా 2020 జూన్ 7న తీవ్ర గుండెపోటుకు గురై కన్నుమూశారు. అప్పటికి మేఘన గర్భవతి. భర్త మృతి చెందిన ఐదు నెలల అనంతరం ఆమె రాయన్ రాజ్ అనే కొడుకును ప్రసవించింది. భర్త చనిపోయిన తర్వాత నుంచీ తరచూ ఆయనను తలచుకుంటూ మేఘన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె రెండో పెళ్లికి సంబంధించిన వదంతులు ప్రచారంలోకి వచ్చాయి.
కొన్ని యూట్యూబ్ చానళ్లు మేఘన, బిగ్ బాస్ కన్నడ 4 విన్నర్ ప్రథామ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపాయి. అలాంటి ఒక యూట్యూబ్ చానల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ప్రథామ్, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించాడు.
"దీన్ని నేను పట్టించుకోకూడదని అనుకున్నాను!! కానీ ఇది 2.70 లక్షలు వ్యూస్ పొందింది!!! వ్యూస్ కోసం, మనీ కోసం చానల్స్ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తే చట్టపరంగా పోరాడటం ఒక్కటే మార్గం. ఇది ఇతర చానళ్లకు గుణపాఠం అవుతుంది. అలాంటి వీడియోలు లీగల్‌గా తొలగించబడతాయి." అని తన ట్వీట్లో రాసుకొచ్చాడు ప్రథామ్.
కన్నడ సినిమాల్లో కలిసి నటించిన చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ సుమారు 10 సంవత్సరాల పాటు ప్రేమించుకొని, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. 2020లో హార్ట్ ఎటాక్‌తో మేఘనను ఒంటరిని చేసి వెళ్లిపోయారు చిరంజీవి.
Also Read