'తెలుగు వన్' సినిమా.. ఏపీలో పెను సంచలనం అవుతుంది!
on Dec 9, 2021

రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో 'తెలుగు వన్' సంస్థ ఎందరో నటీనటులు, దర్శకులు, రచయితలను తెలుగు సినీ పరిశ్రమకు అందించింది. ఇప్పుడు తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ తానే సినీ నిర్మాతగా మారి, మరికొందరిని సినీ పరిశ్రమకు పరిచయడం చేయడతో పాటు, అద్భుతమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నడుం బిగించారు.
కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవిలో శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో 'తెలుగు వన్ ప్రొడక్షన్' లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తీయబోయో మొదటి సినిమాకు అత్యంత వైభవంగా ముహుర్తపు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ దంపతులతో పాటు, డైరెక్టర్ భాను శంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ.. "తెలుగుఒన్ ప్రొడక్షన్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రైతుసమస్యల మీద ఒక రైతుపుత్రుడిగా సెన్సేషనల్ మూవీని నిర్మించబోతున్నాం. భాను శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ డేట్స్ త్వరలోనే ఎనౌన్స్ చేసి, సింగిల్ షెడ్యుల్ లో పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆంధ్రరాష్ట్రంలో పెను సంచలనం అవుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



