'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చింది.. గెస్ట్ ఎవరు?
on Dec 9, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.
ఇటీవల విడుదలైన 'పుష్ప ది రైజ్' ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసిన మూవీ టీమ్.. మాస్ సెలబ్రేషన్స్ పేరుతో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపడానికి రెడీ అయింది. హైదరబాద్ లో యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 12న మాసివ్ ప్రీరిలీజ్ పార్టీని నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బన్నీ గత చిత్రం 'అల వైకుంఠపురములో' ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోనే జరిగింది. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా అక్కడే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాన్ ఇండియా మూవీ పుష్పతో బన్నీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ రానున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ మాత్రం గెస్ట్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ ఈవెంట్ కి నిజంగానే ప్రభాస్ గెస్ట్ గా వస్తాడా లేక మరెవరైనా వస్తారా అనేది త్వరలో తేలనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



