కమల్ ని డైరెక్ట్ చేయబోతున్న తేజ
on May 30, 2014
చిత్రం, జయం, నిజం వంటి చిత్రాలు రూపొందించి, తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్న దర్శకులు తేజ. చాలా కాలంగా పరిశ్రమలో ఎక్కడా కనిపించని తేజా తాజాగా వార్తల్లోకి వచ్చారు. ఆయన జాతీయ స్థాయి నటుడు కమల్ హాసన్ తో కలిసి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారనే సమాచారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 3 భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శక, నిర్మాత తేజానే అని కూడా సమాచారం. చాలా రోజుల తర్వాత తేజా చిత్రాన్ని రూపొందిస్తున్నారు, దానికి నిర్మాత కూడా తానే. ఎక్స్ పరిమెంట్ చిత్రాలు రూపొందించే తేజా, కమల్ తో ఎలాంటి చిత్రం నిర్మిస్తున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.