చిగురించిన నయనతార ప్రేమ
on May 30, 2014
.jpg)
ప్రేమను ప్రేమించే ప్రేమకై, ప్రేమ ఎంత కాలమైనా వేచివుంటుంది. తడబడ్డా, పొరబడ్డా మళ్లీ మళ్లీ ఎదురుపడుతూనే వుంటుంది. సరే కొంచెం కష్టంగా ఉన్న ఈ విషయాన్ని, తిన్నగా చదువుకోండి.
కొన్నేళ్ల క్రితం నయనతార, శింభూ వీరిద్దరూ రేపో, మాపో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు విశేషంగా వచ్చాయి. హాట్ హాట్ ఫోటోలు, విడియోలు కూడా తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవటం, నయనతార - ప్రభుదేవాతో, శింభూ-హన్సికతో జతకట్టడం జరిగాయి, పోయాయి. అదే ఆ జతలు విడిపోయాయి. ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది. ఆ వ్యవహారం ఆ తర్వాత పూర్తిగా విఫలమయింది. నయనతార ప్రేమలు, పెళ్ళిళ్లు కాదని కెరీర్ మీద దృష్టి మళ్లించింది. అలా తమిళ్, తెలుగులో మళ్లీ తన తరహా చిత్రాలు నటిస్తోంది. ఈ గ్యాప్‌లో అటు శింభూ హన్సికను ఘాడంగా ప్రేమించి వదిలిపెట్టాడు.
ఈ పాత ప్రేమికులిద్దరూ ఆ తర్వాత కొంతకాలం పాటు ఒంటరివాళ్లు అవటం, అనుకోకుండా ఒక చిత్రంలో కలిసి నటించడం అంతా సినిమా కథలాగే నడుస్తోంది. తాజాగా వీరిద్దరూ పండియరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఇదు నమ్మ ఆలు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చేరువ వీరికి తమ పాత ప్రేమను చిగురింప చేసినట్లుంది. వీరిద్దరూ ఈ మధ్య పార్టీలకు కలిసి వెళ్తు, కలిసి తిరుగుతూ కనిపిస్తున్నారుట. ఇటీవల వీరిద్దరి స్నేహితురాలు, సినీతార త్రిష పుట్టినరోజు పార్టీలో జంట పక్షుల్లా కనిపించారట నయన, శింభూ. చాలాకాలం తర్వాత వీరిద్దరినీ నవ్వుతూ చూసిన వాళ్లు చూడముచ్చటగా ఉన్న వీళ్లు త్వరలో పెళ్లి కార్డు చేతిలో పెట్టినా ఆశ్చర్యం లేదు అనుకున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



